Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Sep-2016 10:48:46
facebook Twitter Googleplus
Photo

సాహసం శ్వాసగా సాగిపో.. ఎప్పుడో ఏడాదిన్నర కిందట మొదలైన సినిమా. ?ఏమాయ చేసావె? తర్వాత మరోసారి గౌతమ్ మీనన్-నాగచైతన్య కాంబినేషన్లో సినిమా కావడంతో మొదట్నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. దీనికి తోడు ప్రోమోస్.. టీజర్ అన్నీ కూడా ఆసక్తి రేకెత్తించాయి. కానీ గత ఏడాదే వస్తుందనుకున్న సినిమా ఇప్పటిదాకా విడుదల కాలేదు. కనీసం ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియదు. ఈ రోజు చైతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ?సాహసం శ్వాసగా సాగిపో? టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అంటూ విషెస్ చెప్పింది.

తెలుగులో ఈ చిత్రాన్ని సమర్పిస్తున్న కోన వెంటక్.. ఏఎన్నార్ ను రీప్లేస్ చేసేవాళ్లు ఎవ్వరూ లేరని.. ఆయన నిజమైన లెజెండ్ అని ట్వీట్ చేస్తూ ఈ పోస్టర్ వదిలాడు. అంతా బాగుంది కానీ.. ఈ సినిమా రిలీజ్ సంగతి మాత్రం చెప్పలేదు. కమింగ్ సూన్.. అన్న మాట కూడా పోస్టర్ మీద లేదు. బహుశా ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో కోనకు కూడా క్లారిటీ లేదేమో. ఈ మధ్య దీని తమిళ వెర్షన్ కోసం ఓ పాటను బ్యాంకాక్ లో చిత్రీకరించాడు గౌతమ్ మీనన్. అంతటితో అయినా షూటింగ్ అయ్యిందా.. వచ్చే నెలలో అయినా సినిమా రిలీజవుతుందా అన్నది మాత్రం క్లారిటీ లేదు. మరి ఈ సినిమాకు మోక్షం కలిగేదెప్పుడో

,  ,  ,  ,  ,  ,