Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Dec-2015 16:24:18
facebook Twitter Googleplus
Photo

శంకరాభరణం చిత్రానికి అన్నీ తానై వ్యవహరించిన కోన వెంకట్.. ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాల్లో తెగ బిజీగా ఉన్నాడు. తెగ ఇంటర్వ్యూలు ఇచ్చేస్తూ.. బోలెడన్ని సంగతులు కూడా పంచుకుంటున్నాడు. ఇలాగే తను ప్రస్తుతం పౌడర్ అనే ఓ స్క్రిప్ట్ రాస్తున్నానని చెప్పాడు. ఈ పౌడర్ కథ డ్రగ్ మాఫియాకి సంబంధించినది అని హింట్ కూడా ఇచ్చాడు.

టాలీవుడ్ కి డ్రగ్ మాఫియాకి బాగానే లింకులు ఉన్నాయంటారు. చాలాసార్లు ఇది బయటపడింది కూడా. ముంబైలో కంటే హైద్రాబాద్ లోనే నైజీరియన్ డ్రగ్ ముఠాలు ఎక్కువగా తిరగడానికి కూడా ఇదే కారణంగా చెబ్తారు. కొన్ని సందర్భాల్లో టాలీవుడ్ సెలబ్రిటీలు డ్రగ్స్ తో అడ్డంగా దొరికిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకపోతే రవితేజ సోదరుడి పేరు తప్ప మిగతా పేర్లు బయటకు రాలేదు. ఓసారైతే పెద్ద డ్రగ్ రాకెట్ ని పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పేర్లనే వెల్లడించిందని చెప్పారు కూడా. అయితే.. ఇందులో ఏ పేరు కూడా బయటకు రాలేదు. అంతగా మేనేజ్ చేసేశారు మనోళ్ళు. ఇప్పుడు ఆ డ్రగ్ రాకెట్ కథని మీడియాని టాలీవుడ్ మేనేజ్ చేసిన సీక్రెట్స్ నే బేస్ చేసుకుని.. పౌడర్ కథని కోన రాస్తున్నాడని తెలుస్తోంది. ఇది నిజమే అయితే మాత్రం కోన పెద్ద పుట్టనే తవ్వుతున్నాడని అనుకోవచ్చు.

కాంటాక్టులే ఎక్కువగా వర్కవుట్ అయ్యే టాలీవుడ్ లో.. కొంతమంది చేసే తప్పులను బయటపెట్టే ప్రయత్నం సాహసమే అవుతుంది. అయితే.. కేవలం దీన్ని సినిమాటిక్ గానే రాస్తాడా.. లేక అసలు వ్యక్తులను ఎక్స్ పోజ్ చేసేలా తీస్తాడా అన్నది కూడా ఆలోచించాలి.

,  ,  ,