Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Dec-2015 17:35:20
facebook Twitter Googleplus
Photo

చేపకళ్ల ప్రణీత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు ఆరంభం తెలుగులో వరుస పరాజయాలతో ఢీలా పడిపోయింది. ఇక కెరీర్ పరంగా అయిపోయినట్టే అనుకుంటున్న టైమ్ లో అత్తారింటికి దారేది అవకాశాన్ని అందుకుంది. కన్నడలో పోకిరి రీమేక్ తో హీరోయిన్ అయ్యింది. అనుకోకుండానే తెలుగులో అవకాశాలు అందుకుని అందరి దృష్టిలో పడింది. చేపకళ్లను మిటకరిస్తూ కుర్రకారు గుండెల్ని చిదిమేసింది కాబట్టి ఈ మాత్రం కెరీర్ సాధ్యమైంది.

ఏదేమైనా ఈ అమ్మడికి తెలుగులో వచ్చిన ఛాన్సులన్నీ వేరొక కథానాయికతో షేరింగు చేసుకోవాల్సినవే. ఇదే విషయాన్ని అమ్మడినే ప్రశ్నిస్తే ఏమని తిట్టిందో తెలుసా? సెకండ్ లీడ్ .. ఫస్ట్ లీడ్ .. ఏంటి రబ్బిష్ !! ఇలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి. అయినా మనం ఎలాంటి లీడ్ చేశాం అనే కంటే ఎలాంటి క్యారెక్టర్ లో నటించాం అన్నదే ముఖ్యం. నటనకు స్కోప్ కావాలి అంతే. నటి అన్నాక ఎలాంటి పాత్రలు వచ్చినా చేయాలి.. అని క్లాస్ పీకింది.

అత్తారింటికి దారేది - రభస సినిమాల తర్వాత ప్రస్తుతం ఈ భామ బ్రహ్మోత్సవం సినిమాలో ఒకానొక కథానాయికగా ఆడిపాడుతోంది. మాతృ పరిశ్రమ కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

,  ,  ,