Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Oct-2015 14:03:44
facebook Twitter Googleplus
Photo

శ్రీను వైట్ల కష్టాల ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. ఒక వైపు బ్రూస్ లీ అంత నెగిటివ్ రావడానికి వైట్లనే కారణమంటూ.. అతడిపై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. తమ హీరో రామ్ చరణ్ కెరీర్ లో ఇంత నెగిటివ్ టాక్ వచ్చిన మూవీ ఇదేనంటూ మండిపడుతున్నారు. మరోవైపు వైట్ల భార్య శ్రీనుపై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం రాజీ ప్రయత్నాలు - కౌన్సిలింగుల కారణంగా.. వైట్ల బాగా డిస్టర్బ్ అయ్యాడు.

ఇదే సమయంలో బ్రూస్ లీ మరో తంటా తెచ్చిపెడుతోంది ఈయనకు. శ్రీను వైట్లపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేసేందుకు కోన వెంకట్ సిద్ధమవుతున్నాడని అని వార్తలు వచ్చాయి. తాను స్టోరీ ఇచ్చినట్లుగా టైటిల్ కార్డ్స్ వేసినా.. కథ మొత్తాన్ని ఇష్టం వచ్చినట్లుగా వైట్ల మార్చేశాడన్నది కోన ఆరోపణ. ఇప్పటికే హైకోర్ట్ లాయర్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడట కోన వెంకట్.

అసలు తన పేరు ఉపయోగించకుండా ఉన్నా.. పెద్దగా ఫీలయ్యేవాడిని కాదు అంటూ సన్నిహితుల దగ్గర అంటున్నాడట కోన. ఈ విషయంలో ఫ్యాన్స్ కి మిగిలిన వారికి స్పష్టత రావడం కోసం.. అసలు స్క్రిప్ట్ ను ఆన్ లైన్ లో పబ్లిష్ చేయాలని భావిస్తున్నాడట కోన. ఒకవేళ కేసు ఫైల్ అయితే మాత్రం.. తన కథని మార్చేశారని డైరెక్టర్ పై ఓ రైటర్ కేసు పెట్టడం టాలీవుడ్ చరిత్రలో ఇదే మొదటిది అవుతుంది.

,  ,  ,  ,