Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Oct-2017 12:45:04
facebook Twitter Googleplus
Photo

కళ్యాణ్ రామ్ ఇప్పుడు జోష్ లోనే ఉన్నాడు. ఈ హీరో నిర్మాతగా తెరకెక్కించిన జై లవకుశ ఇప్పుడు బాగానే పెర్ఫామ్ చేస్తోంది. చాలా ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రిలీజ్ రోజున టాక్ అటూ ఇటూగా వచ్చినా.. ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న ఫామ్.. యంగ్ టైగర్ చూపిన వైవిధ్యమైన నటన.. మూవీ వసూళ్లను నిలబెట్టాయి.

మరోవైపు తను హీరోగా తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ లో కూడా వేగం పెంచాడు కళ్యాణ్ రామ్. ఉపేంద్ర మాధవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న మూవీ ఎమ్మెల్యే.. మంచి లక్షణాలున్న అబ్బాయి అని ఈ ఎమ్మెల్యేకి అర్ధం. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఓ భారీ ఫైట్ సీక్వెన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ పరిసరాల్లో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఫైట్ సీన్ ను రెయిన్ ఎఫెక్ట్ తో తెరకెక్కించాలని ముందుగానే డిసైడ్ అయ్యారు. అందుకు తగ్గట్లుగానే షూట్ మొదలుపెట్టగానే.. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ఒరిజినల్ వర్షాల్లోనే ఫైట్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. ఎంతైనా ఆర్టిఫిషియల్ రెయిన్ ఎఫెక్ట్ కి.. నిజంగా కురిసే వానలో తీసిన సీన్ కి.. స్క్రీన్ పై చాలా డిఫరెన్స్ కనిపించడం ఖాయం.

ఈ అడ్వాంటేజ్ ను పక్కాగా ఉపయోగించేసుకుంటున్నాడట ఎమ్మెల్యే. ఈ షెడ్యూల్ తో దాదాపుగా సినిమా షూటింగ్ పూర్తయిపోతుందని.. నవంబర్ 8నాటికి ఫినిష్ చేసేసి.. తన మరుసటి మూవీ షూటింగ్ కి వెళ్లాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడట.

,  ,  ,  ,  ,