Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Sep-2016 11:05:20
facebook Twitter Googleplus
Photo

జనతా గ్యారేజ్ లో హీరోను ప్రకృతి ప్రేమికుడు. ఇలా చూపించేటపుడు హీరోను మెచ్యూర్డ్ గా చూపించాల్సి ఉంటుంది. ఐతే పర్యావరణం మీద అంత అవగాహన ఉన్నవాడు.. తన మావయ్య కూతుర్ని ప్రేమించడం.. మేనరికం చేసుకోవడానికి సిద్ధపడటం ఏంటి అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ?జనతా గ్యారేజ్? సక్సెస్ మీట్ సందర్భంగా కొరటాల ఈ విషయం ప్రస్తావించాడు. తాను ఈ విషయంలో అంత డీప్ గా ఆలోచించలేదని చెప్పాడు. ??ఇది సరైన అభ్యంతరమే. ఐతే నేను అంత డీప్ గా.. ఆ కోణంలో ఆలోచించలేదు. హీరో ప్రకృతి ప్రేమికుడు కాబట్టి అతడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి.. అతను ఎలాంటి బట్టలు వేసుకోవాలి.. ఎలా ప్రవర్తించాలి.. ఎలా మాట్లాడాలి అన్నది రీసెర్చ్ చేసి ఆ పాత్రను డిజైన్ చేశాను. ఈ మేనరికం గురించి ఆలోచించలేదు?? అని చెప్పాడు.

సినిమాలో హీరోయిన్ల పాత్రలకు సరైన ప్రాధాన్యం లేదన్న విమర్శలపై స్పందిస్తూ.. ??హీరోయిన్ల పాత్రలు ఇంత ఉండాలి.. ఇంతే లెంగ్త్ లో ఉండాలి.. అనేదేమీ లేదు. కథకు ఎంత అవసరమో అంత వరకే వాళ్ల పాత్రలు రాశాను. వాళ్ల పాత్రలకు సరైన ప్రాధాన్యమే ఉంది?? అని కొరటాల అన్నాడు. నరేషన్ స్లో అన్న విమర్శల్ని కొరటాల అంగీకరించలేదు. సినిమా ఎక్కడా నెమ్మదిగా సాగదని.. సినిమాలో వేగం ఉంటుందని అన్నాడు. ఓవరాల్ గా ?జనతా గ్యారేజ్?కు పాజిటివ్ ఫీడ్ బ్యాకే వస్తోందని.. కలెక్షన్లు అద్భుతంగా ఉన్నాయని.. అమెరికాలో సినిమా అదరగొడుతోందని.. అన్ని చోట్లా బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారని.. సినిమా రిజల్ట్ విషయంలో అందరం చాలా హ్యాపీగా ఉన్నామని కొరటాల అన్నాడు.

,  ,  ,  ,  ,  ,