Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2017 11:12:15
facebook Twitter Googleplus
Photo

కొరటాల శివ టాప్ లీగ్ డైరెక్టర్లలో ఒకడు అనే విషయం ఒప్పుకోవాల్సిందే. మిర్చి.. శ్రీమంతుడు.. జనతా గ్యారేజ్ అంటూ తను హ్యాండిల్ చేసిన ప్రతీ సబ్జెక్టును ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ అందించేసి.. కేవలం మూడు సినిమాలతోనే టాప్ లీగ్ లోకి వచ్చేశాడు. ఇప్పుడు కొరటాల స్టైల్ మేకింగ్ కు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.

అయితే.. ఈ దర్శకుడు రీసెంట్ గా ఓ సినిమాకు తెగ కరెక్షన్స్ చేసేశాడు. సాయి ధరం తేజ్ హీరోగా రవి దర్శకత్వంలో రూపొందిన జవాన్ మూవీ షూటింగ్ మూడు నెలల క్రితమే దాదాపుగా పూర్తయిపోయింది. సెప్టెంబర్ 1నే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా.. అవుట్ పుట్ నచ్చకపోవడంతో రిలీజ్ ఆపేశారు. దిల్ రాజు నుంచి యూనిట్ లో ఎవరికీ జవాన్ కాన్సెప్ట్ నచ్చినా.. సబ్జెక్ట్ హ్యాండిల్ చేసిన తీరు ఆకట్టుకోలేదు. ఇలాంటి సమయంలో కొరటాల శివ తనంతట తనే ముందుకు వచ్చి.. తన స్నేహితుడు అయిన రవికి సాయం చేశాడు. ఎన్నో సీన్లను మళ్లీ రీషూట్ చేసి మార్చాడు అంటూ జవాన్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో దిల్ రాజు స్వయంగా చెప్పాడు.

అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి దిల్ రాజు సమర్పకుడు. ఈ చిత్రానికి.. టాప్ రేంజ్ డైరెక్టర్ కరెక్షన్స్ చేయడం నిజంగా అభినందనీయమే. ఇప్పుడు జవాన్ రిజల్ట్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి నెలకొంది.

,  ,  ,  ,  ,  ,