Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Jun-2016 10:52:32
facebook Twitter Googleplus
Photo

తొలి రెండు సినిమాలకు బ్లాక్ బస్టర్లను కొట్టడం.. ఏ దర్శకుడికైనా అంత తేలికైన విషయం కాదు. అలాంటిది తను తీసిన రెండు సినిమాలతోను.. ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ ఇవ్వడం చాలా అంటే చాలా అరుదైన విషయం. మిర్చితో ప్రభాస్ కు అన్ ఎక్స్ పెక్టెడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన కొరటాల.. శ్రీమంతుడు చిత్రాన్ని తీసి మహేష్ తో ఓ ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టేశాడు. ఈ ప్రభావం.. కొరటాల పుచ్చుకునే పారితోషికంపై బాగానే కనిపిస్తోంది.

ప్రభాస్ తో మిర్చి సినిమా తీసినందుకు కొరటాలకు ఎంత మొత్తం గిట్టుబాటు అయిందో చెప్పడం కష్టం కానీ.. శ్రీమంతుడు చిత్రంకోసం మాత్రం 3 కోట్లు అందుకున్నాడు. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించడంతో.. ఓ భారీ గిఫ్ట్ కూడా ఇచ్చాడు మహేష్. ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ తీసేందుకుగాను.. 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడు. ఒకే సారి 5 కోట్ల మేర పెరగడం రికార్డే కానీ.. అతను సాధించిన రెండు బ్లాక్ బస్టర్స్ ఆ రేంజ్ కు తీసుకెళ్లాయి.

ఇప్పుడు తన తర్వాతి రెండు చిత్రాలను కూడా కొరటాల సైన్ చేసేశాడు. అందులో ఒకటి నిర్మాత డీవీవీ దానయ్యతో కాగా.. ఆ మూవీకోసం అక్షరాలా పది కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తోంది. అంటే నాలుగో సినిమాకే 10 కోట్ల రేంజ్ కి కొరటాల రీచ్ అయ్యాడన్న మాట. ఆ తర్వాత కూడా తన స్నేహితులకి ఓ సినిమా చేస్తున్నందుకు ఇదే మొత్తాన్ని తీసుకోనున్నాడు ఈ సంచలన దర్శకుడు.

,  ,  ,  ,  ,  ,