Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Oct-2016 11:06:34
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ఇప్పుడు ధృవ మూవీని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చేశాడనే విషయం అఫీషియల్. ఒకే ఒక్క పాట తప్ప వేరే ఏమీ పెండింగ్ లేదు. నవంబర్ లో ఆడియో.. డిసెంబర్ లో మూవీ రిలీజ్ అయిపోతున్నాయి కూడా. ఆ వెంటనే రామ్ చరణ్-సుకుమార్ ల కాంబినేషన్ లో ఓ మూవీ మొదలవుతుంది. అయితే.. మెగా పవర్ స్టార్ తో దర్శకుడు క్రిష్ కూడా ఓ మూవీ చేసేందుకు రంగం సిద్ధమవుతోందట.

రీసెంట్ గా బడా నిర్మాత అశ్వనీదత్ మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సంగతి తెలిసిందే. చిరుతో ఈ నిర్మాత సినిమా చేయనున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ అసలు విషయం ఏంటంటే.. చిరుతో ఈయన తీసిన జగదేకవీరుడు అతిలోక సుందరి మూవీని.. ఈ తరానికి అనుగుణంగా మార్చి.. రామ్ చరణ్ తో తీయాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతున్నారు అశ్వినీదత్. ఈ చిత్రాన్ని ఇప్పటి జనరేషన్ లో క్రిష్ మాత్రమే కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తారనే అభిప్రాయానికి వచ్చాడట అశ్వినీదత్. దానికి సంబంధించిన మాటల కోసమే.. చిరు-అశ్వనీదత్ లు భేటీ అయ్యారని.. ఇప్పటికే సరే అని ఓ మాట అనేసుకున్నారని కూడా తెలుస్తోంది. క్రిష్ డైరెక్షన్ అనేసరికి చిరు కూడా ఉత్సాహం చూపారట.

రామ్ చరణ్ తో తీయబోయే మూవీకి.. జగదేక వీరుడు అనే టైటిల్ ని కూడా ఫైనల్ చేసుకున్నారు అశ్వినీదత్. ఇప్పటికి ఫిలింనగర్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. 'రామ్ చరణ్ తో క్రిష్ డైరెక్షన్ లో అశ్వినీదత్ నిర్మాణంలో సినిమా ఖాయం. కాకపోతే అది జగదేక వీరుడు- అతి లోక సుందరి రీమేకా కాదా అన్నదే తేలాలి' అనుకుంటున్నారు సినీ జనాలు.

,  ,  ,  ,  ,