Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Nov-2016 13:31:21
facebook Twitter Googleplus
Photo

దేశవాళీ వినోదం అన్న ట్యాగ్ లైన్ తో జనాల్ని బాగానే ఆకర్షిస్తోంది ?జయమ్ము నిశ్చయమ్మురా? టీం. ఒకప్పటి వంశీ సినిమాల తరహాలో పల్లెటూరి వినోదాన్ని పంచేలా కనిపిస్తోందీ సినిమా. మొదట్నుంచి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది. మొన్న ?తత్కాల్? పేరుతో ప్రవీన్ పాత్రను పరిచయం చేసిన తీరు బాగుంది. తాజాగా మరో కమెడియన్ క్యారెక్టర్ పరిచయంతో టీజర్ వదిలారు. ఆ కమెడియన్ మరెవరో కాదు.. కృష్ణభగవాన్. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా వెలుగొందిన కృష్ణభగవాన్ ఈ మధ్య సినిమాల్లో కనిపించడం అరుదైపోయింది. చివరగా ఆయన చెప్పుకోదగ్గ క్యారెక్టర్ చేసింది ?అలా ఎలా?లోనే.

?జయమ్ము నిశ్చయమ్మురా?లో కృష్ణభగవాన్ క్యారెక్టర్ బాగానే నవ్వించేలా ఉంది. ఇందులో ఆయన పాత్ర పేరు.. అడపా ప్రసాద్. మునిసిపల్ ఆఫీసులో సీనియర్ సూపరింటెండెంటుగా పనిచేసే ఈ పాత్రకు ఎవరైనా సంతోషంగా ఉంటె అస్సలు ఇష్టముండదు. ఆ సంతోషానికి ఏదో విధంగా తక్షణం భగ్నం కలిగించేంతవరకు అతని మనశ్శాంతి ఉండదట. ?ఒక శాంపిల్ చూస్తారేటి..?? అనేది అతగాడి ఊతపదం. ఈ ఊతపదంతో తనదైన శైలిలో వినోదం పంచే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణభగవాన్. టీజర్ సరదాగానే ఉంది. ఈ సినిమాకు ?సమైక్యంగా నవ్వుకుందాం? అంటూ కొత్త ట్యాగ్ లైన్ జత చేయడం విశేషం. శ్రీనివాసరెడ్డి-పూర్ణ జంటగా నటించిన ఈ చిత్రాన్ని శివరాజ్ కనుమారి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.

,  ,  ,  ,  ,