Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Sep-2017 15:24:01
facebook Twitter Googleplus
Photo

పాత్రనైన మా తారక రాముడు ఈజీగా చేయగలడు అని దర్శక దిగ్గజాల నుండి మన్ననలను అందుకున్నాడు ఎన్టీఆర్. మొదటి సారి త్రిపాత్రాభినయం లో కనిపించి జై లవకుశ తో ప్రేక్షకులను అలరించిన తారక్ మరో మంచి కథాంశంతో రాబోతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్నాను అని ఇది వరకే చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు. అయితే ఈ సినిమాలో తారక్ పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం అందరిలో ఆసక్తిని రేపుతోంది.

త్రివిక్రమ్ ఎలాంటి దర్శకుడో అందరికి తెలిసిన విషయమే. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తీయడంలో ఆయనకు సాటి ఎవరు లేరని చెప్పాలి. అయితే ఈ కథలో ఎన్టీఆర్ పాత్ర ఎన్నడు చూడని విధంగా కొత్తగా ఉండబోతోందట. సినిమాలో మిలిటరీ అపరేటివ్ ఆఫీసర్ గా తారక్ కనిపించబోతున్నాడు. అలాగే సినిమాలో త్రివిక్రమ్ మార్క్ కామెడీ మరియు ఎమోషనల్ సీన్స్ ఉంటాయట. జనవరి తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రంతో చాలా బిజీగా ఉన్నాడు. ఆ సినిమా వచ్చే సంక్రాంతి కి రిలీజ్ కాబోతోంది. దీంతో ఫిబ్రవరిలో లో ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకోనుంది.

ఇక త్వరలో సినిమాకు సంబంధించిన సాంకేతిక నిపుణుల వివరాలను మీడియాకు తెలిపే అవకాశం ఉంది. ఇప్పటికే అనిరుద్ ని సంగీత దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్నారని తెలుస్తోంది. పవన్ సినిమాకు కూడా అతనే సంగీతం అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,