Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Jul-2017 15:14:11
facebook Twitter Googleplus
Photo

విషయమైనా మొహం మీద కొట్టినట్లు చెప్పడం కృష్ణవంశీకి అలవాటు. ఈ క్రియేటివ్ డైరెక్టర్ వరుస హిట్లతో ఊపుమీదున్నపుడూ అంతే.. ఫామ్ కోల్పోయినప్పుడూ అంతే. అందుకే కృష్ణవంశీకి పొగరెక్కువ అనే అభిప్రాయం ఇండస్ట్రీలో బలపడింది. కొందరు కృష్ణవంశీని ఉద్దేశించి ప్రత్యక్షంగా.. పరోక్షంగా విమర్శలు గుప్పించడం తెలిసిన సంగతే. అతడితో పని చేయడం కష్టమన్న అభిప్రాయం కూడా ఉంది ఇండస్ట్రీలో.

ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయమై కృష్ణవంశీ దగ్గర ప్రస్తావిస్తే.. నాతో పని చేసిన వాళ్లలో 20 శాతం మంది నన్ను తిట్టుకుంటారు. 80 శాతం మంది నా దగ్గర చాలా నేర్చుకున్నట్లు చెబుతారు. ఒక హీరో ఉన్నాడు. అతడికి జ్నాపకశక్తి తక్కువ. రెండు డైలాగుల కంటే ఎక్కువ చెప్పలేడు. పాత్రను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేడు. ఇది కాదు బాబూ అని చెబితే నాపై అలుగుతాడు. దీంతో సెట్లు టేకులు పెరుగుతాయి. బయటికెళ్లి నా గురించి చెడుగా చెబుతాడు అన్నాడు. ఈ వ్యాఖ్యలు కృష్ణవంశీ జనరల్ గా అన్నాడా.. పర్టికులర్ గా ఎవరినైనా ఉద్దేశించి అన్నాడా అన్న చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. బాబూ అన్న మాట వాడాడంటే ఎవరో వారసుడి గురించే ఈ మాట అని ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇక తన చివరి సినిమా గోవిందుడు అందరి వాడేలే ఫ్లాప్ కావడంపై స్పందిస్తూ.. తాను ప్రేక్షకులు ఇష్టపడేలా ఆ చిత్రాన్ని తీయలేకపోయాననుకుంటున్నట్లు కృష్ణవంశీ తెలిపాడు. తాను చరణ్ కు ఈ సినిమా విషయంలో బాకీ పడ్డానని.. కాబట్టి చరణ్ కెరీర్లో గుర్తుండిపోయేలా ఇంకో సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

,  ,  ,  ,