Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 17:05:21
facebook Twitter Googleplus
Photo

సాయిధరమ్ తేజ్ జోరుమీదున్నాడు. మూడో సినిమాకే ఆయన యువ కథానాయకుల్లో టాప్ పొజిషన్ కి వచ్చేలా ఉన్నాడు. పక్కా మాస్ కథలు పడటం ఆయనకి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. `పిల్లా నువ్వు లేని జీవితం` సూపర్ హిట్ కావడం ఆ వెంటనే దిల్ రాజు `సుబ్రమణ్యం ఫర్ సేల్` మొదలెట్టడం గురువారమే విడుదలవుతున్న ఆ సినిమాకి పాజిటివ్ బజ్ కనిపిస్తుండటంతో అగ్ర దర్శకులంతా ఇప్పుడు సాయిధరమ్ తేజ్ పై కన్నేశారు. ఒకరకంగా `గబ్బర్ సింగ్`లాంటి హిట్టిచ్చిన హరీష్ శంకర్ తో `సుబ్రమణ్యం ఫర్ సేల్` చేయడం కూడా సాయికి బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. భవిష్యత్తులో సాయిధరమ్ తేజ్ ఎవరెవరితో సినిమాలు చేస్తాడో తెలియదుకానీ... అర్జంటుగా అయితే మాత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో వరుసగా రెండు సినిమాలు చేశాడు సాయిధరమ్ తేజ్. మూడు - నాలుగో సినిమాలు కూడా ఆయనతోనే చేస్తానంటున్నాడు. మూడో సినిమాకి దర్శకుడు ఎవరన్నది ఇప్పటికే తెలిసిపోయింది. `పటాస్` ఫేమ్ అనిల్ రావిపూడి ఆ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. నాలుగో సినిమాకి కూడా కథ రెడీ అయ్యింది. రచయిత వేగేశ్న సతీష్ `శతమానం భవతీ` పేరుతో కథ తయారు చేశాడట. అయితే ఆ కథని కృష్ణవంశీ తోనే తీయించాలని దిల్ రాజు భావిస్తున్నట్టు తెలుస్తోంది. వేగేశ్న సతీష్ కూడా దర్శకుడే అయినా... అలాంటి మంచి కథ కృష్ణవంశీ లాంటి దర్శకుడి చేతిలో పడితేనే బాగుంటుందని దిల్ రాజు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దిల్ రాజు ఆఫీసులో ఆ కథ గురించి కృష్ణవంశీ మంతనాలు చేస్తున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే `సుబ్రమణ్యం ఫర్ సేల్` ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక వారంలోపుగా `శతమానం భవతీ` సినిమాని మొదలెట్టొచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

,  ,  ,  ,