అవు.. పులి.. మధ్యలో ప్రభాస్ పెళ్లి అంటూ ఈ మధ్య ఓ కామెడీ సినిమా కూడా వచ్చేసింది. ప్రభాస్ పెళ్లి విషయాలు ఇంత కామెడీ అయిపోయాయా అనిపించక మానదు. తాజా పరిస్థితులు చూస్తే మాత్రం.. ఈ అనుమానాలు నిజం అనిపించడంలో ఆశ్చర్యం లేదు.
అప్పుడెప్పుడో బాహుబలి మొదలు కాక ముందు ప్రభాస్ మ్యారేజ్ విషయం బాగా హాట్ గా నడిచేది. ఆ తర్వాత ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా.. బాహుబలి2 రిలీజ్ తర్వాతే అని చెప్పడం.. వాయిదాలు వేస్కుంటూ రావజం సహజం అయిపోయింది. రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఈ విషయంలో ఇలాంటి కబుర్లే చెప్పుకుంటూ వస్తున్నారు. అమ్మాయి ఫైనల్ అయింది. ప్రభాస్ తాళి కట్టడమే ఇక బ్యాలెన్స్ అని అందరూ అనుకుంటున్న సమయంలో.. ఇప్పుడు 'పెళ్లి కూతురు ఇంకా ఫైనల్ కాలేదు. మా క్లోజ్ సర్కిల్ లోనే అమ్మాయిని చూస్తున్నాం. బాహుబలి2 రిలీజ్ తర్వాత ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని చెప్పారు కృష్ణంరాజు.
ప్రభాస్ పెళ్లి అనే టాపిక్.. బాగా రొటీన్ అయిపోవడంలో కృష్ణం రాజు స్టేట్మెంట్స్ కూడా కారణం అవుతున్నాయని చెప్పచ్చు. అసలు మీడియా ఆ టాపిక్ ని టచ్ చేయకపోయినా ఆయన మాత్రం మధ్యమధ్యలో గుర్తు చేసేస్తూ ఉంటారు