Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

10-May-2017 12:28:20
facebook Twitter Googleplus
Photo

ఇప్పుడు వరుసగా రిలీజుకు రెడీగా ఉన్న సినిమాలతో బిజీగా ఉంది అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠి. తొలిసినిమాలో చీరల్లో కనిపించడం వలన అన్నీ అలాంటి పాత్రలే ఇస్తున్నారని.. నేను టూ పీస్ వేసుకోవడానికి కూడా రెడీగానే ఉన్నాను అంటూ ఈ మధ్యనే ఈ బంగారం స్టేట్మెంట్లు కూడా ఇచ్చేసింది. అవన్నీ ఒకెత్తయితే ఇప్పుడు తన ఫ్లాప్స్ గురించి భారీ కామెంటే చేసిందిలే.

ఈ శుక్రవారం వస్తున్న రాధ.. ఆ తరువాత వచ్చే నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం.. సందీప్ కిషన్ తో చేసిన మాయావన్ తెలుగు వర్షన్.. ఇలా వరుస రిలీజులతో తెగ బిజీగా ఉంది లావణ్య త్రిపాఠి. అమ్మడు రాధ సినిమాలో ఆరబోసిన గ్లామర్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే మొన్న రిలీజైన వరుణ్ తేజ్ మిష్టర్ ఫ్లాపైందిగా నానా అంటే.. అమ్మడు మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ సింపుల్ గా రిప్లయ్ ఇచ్చింది. ఎన్ని సినిమాలు చేస్తోంది.. నెం.1 రేసులో ఎక్కడుంది.. ఇతర కాంపిటీషన్ అనే విషయాల గురించి అడిగినప్పుడు కూడా 'ఐ డోంట్ కేర్' అనే చెప్పింది.

లావణ్య స్టేట్మెంట్లు వింటున్న వారు.. నీ టైమ్ నడుస్తోందిలే పాపా.. వరుసగా చేతిలో సినిమాలు ఉన్నాయిగా.. ఇప్పుడెందుకు నువ్వు కేర్ చేస్తావ్.. కానివ్.. అంటున్నారు. నిజానికి ఒక్కసారి బ్రేక్ వచ్చిన తరువాత.. హీరోయిన్లు హిట్లు కొట్టినా కొట్టకపోయినా సినిమాలు వస్తూనే ఉంటాయ్.

,  ,  ,  ,  ,