Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Nov-2014 10:52:53
facebook Twitter Googleplus
Photo

ఈమధ్య మనతారలు సామాజిక అంశాల పట్ల బాగా స్పందిస్తున్నారు. ఆయా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న వైనం మనం చూస్తున్నాం. ఇటీవలే హీరో అల్లు అర్జున్ అలా 'అయామ్ దట్ చేంజ్' అనే షార్ట్ ఫిలింలో నటించాడు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కృష్ణంరాజు కూడా అటువంటి బాధ్యతను తీసుకోవడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ గాయకుడు, గిన్నిస్ రికార్డు విజేత గజల్ శ్రీనివాస్ 'క్లీన్ గంగ' పేరిట ఓ లఘు చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కీలకపాత్ర పోషించమని కృష్ణంరాజును ఆయన కోరినట్టు, అందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడచ్చు

,  ,  ,  ,