Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-May-2016 13:41:56
facebook Twitter Googleplus
Photo

కొన్ని నెలల క్రితం సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హాస్పిటల్ లో ఎడ్మిట్ అయ్యారు. అప్పట్లో ఆయనకు శ్వాసకోస సంబంధిత ప్రాబ్లమ్స్ రావడంతో.. అలా ఇబ్బంది పడ్డారు. అయితే ఈరోజు ఉదయం నుండి ఆయన ఐ.సి.యు.లో ఉన్నారంటూ తెగ వార్తలొచ్చేస్తున్నాయి. ఇంతకీ ఇవన్నీ నిజమేనా?

ప్రభాస్ కూడా తన పనులన్నీ మానుకొని హాస్పిటల్ దగ్గరే ఉన్నాడని చెప్పడంతో.. అభిమానులు కాస్త గందరగోళంలో పడ్డారు. అయితే ఇదంతా అసలు నిజం కాదట. కేవలం రొటీన్ చెక్ కోసం కృష్ణంరాజు హాస్పిటల్ కు వచ్చారు తప్పిస్తే.. ఆయన హెల్త్ కు వాటిల్లిన ముప్పేమీ లేదని ఆయన పి.ఆర్.ఓ. తెలియజేశారు. జస్ట్ చెక్ చేయించుకొని ఆయన ఇంటికి బయలుదేరు వెళ్ళిపోయారట కూడా. కాకపోతే మీడియాలో మాత్రం ఐ.సి.యు అంటూ ఏదేదో రూమర్లు చెప్పేశారని అంటున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ కు పెళ్లి సంబంధాలు వెతికే పనిలో బిజీగా ఉన్నారు కృష్ణంరాజు. త్వరలోనే ఆయన ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించనున్నారు.

,  ,  ,  ,