Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Jul-2017 13:41:55
facebook Twitter Googleplus
Photo

పని చేసే వాళ్లందరికీ చుక్కలు చూపిస్తుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. తన కొత్త సినిమా నక్షత్రం ఆడియో వేడుకలో భాగంగా కృష్ణవంశీ ఇలా వ్యాఖ్యానించాడు. మీకెవరైనా ఇప్పటిదాకా నక్షత్రాలు (చుక్కలు) చూపించారా అని అడిగితే.. నాకెవరూ చూపించలేదు. నేనే చాలామందికి చుక్కలు చూపిస్తుంటా అని నవ్వేశాడు కృష్ణవంశీ. మీ జీవితంలో నక్షత్రం ఎవరు అని అడిగితే.. తన కొడుకని బదులిచ్చాడాయన. మరి మీ భార్య రమ్యకృష్ణ సంగతేంటి అని అడిగితే.. ఆమె నక్షత్రం కాదు.. ఆకాశం అంటూ తనదైన శైలిలో బదులిచ్చాడు కృష్ణవంశీ.

ఇక నక్షత్రం గురించి చెబుతూ.. దీని కోసం చాలా కష్టపడ్డట్లు చెప్పాడు. తనతో పాటు యూనిట్లో ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం చాలా శ్రమించారని కృష్ణవంశీ తెలిపాడు. ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ పరచదని.. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని కృష్ణవంశీ తెలిపాడు. హీరోలు సందీప్ కిషన్.. సాయిధరమ్ తేజ్.. హీరోయిన్లు రెజీనాలతో పాటు తనీష్ కూడా చాలా బాగా చేశాడని.. వీళ్లతో పని చేయడం మంచి అనుభవం అని కృష్ణవంశీ తెలిపాడు. అతి త్వరలోనే నక్షత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని చెప్పాడు. దాదాపు దశాబ్దం నుంచి కృష్ణవంశీ నుంచి సరైన సినిమా రాలేదు.

,  ,  ,  ,  ,