Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Feb-2017 13:09:50
facebook Twitter Googleplus
Photo

సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ సందీప్ కిషన్ హీరోగా నక్షత్రం అనే సినిమా మొదలుపెట్టినపుడు బజ్ బాగానే ఉంది. దీనికి తోడు ఒక టైంలో పది ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేసి.. సినిమాను విభిన్నంగా ప్రమోట్ చేయించాడు కృష్ణవంశీ. మిగతా క్యారెక్టర్ల పరిచయం కూడా కొంత ఆసక్తి రేకెత్తించింది. ఇంకొన్ని రోజుల్లోనే సినిమాను రిలీజ్ చేసేయబోతున్నట్లు అగ్రెసివ్ గా ప్రమోషన్లు చేసింది నక్షత్రం టీం. ఐతే అంతగా సినిమాను ప్రమోట్ చేస్తున్న వాళ్లు ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. మూడు నాలుగు నెలలుగా ఈ సినిమా గురించి అప్ డేట్సే లేవు. సినిమా ఏ దశలో ఉందో తెలియదు. అసలు షూటింగ్ జరుగుతోందా.. ఆగిందా అన్న అప్ డేట్ కూడా లేదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సినిమాకు చివరి దశలో బ్రేక్ పడ్డట్లుగా వార్తలొస్తున్నాయి.

కొన్ని నెలలుగా సినిమా వార్తల్లో లేకపోవడంతో ఇంతకుముందు వచ్చిన హైప్ ఇప్పుడు లేదు. సందీప్ కిషన్ ట్రాక్ రికార్డు కూడా ఏమంత బాగా లేకపోవడం కూడా ఈ సినిమాకు మైనస్ అయింది. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ఆశలు ప్రధానంగా సాయిధరమ్ తేజ్ మీద ఉన్నాయి. తేజు ఈ చిత్రంలో 20 నిమిషాల గెస్ట్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. అంత:పురం లో జగపతిబాబు పాత్ర లాగా ఇది చాలా స్పెషల్ అంటున్నారు. సినిమాకు ఆ క్యారెక్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందట. ఈ నేపథ్యంలో తేజును ముందు పెట్టి సినిమాను ప్రమోట్ చేస్తే మళ్లీ హైప్ తీసుకురావచ్చని కృష్ణవంశీ భావిస్తున్నాడట. ఐతే అంతకంటే ముందు తేజు విన్నర్ సినిమాతో హిట్టు కొట్టాలి. అదే జరిగితే నక్షత్రం కు అది కచ్చితంగా ప్లస్ అవుతుంది. విన్నర్ హిట్టయితే వెంటనే మళ్లీ ప్రమోషన్లు మొదలుపెట్టి సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయాలని కృష్ణవంశీ భావిస్తున్నాడట.

,  ,  ,  ,  ,