Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Jul-2015 14:17:01
facebook Twitter Googleplus
Photo

ఒకప్పుడు కొత్త కథానాయికలు అగ్రకథానాయకుల జోడీకట్టే అవకాశం కోసం చాలాకాలం ఎదురుచూడవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందం .. ఆకర్షణీయమైన రూపంతో అవసరమైనంత అభినయం చేస్తే చాలు, స్టార్ హీరోల సినిమాల నుంచి వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయని కృతీసనన్ మరోమారు నిరూపించింది. తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందనున్న 'సుల్తాన్' సినిమాలో ఆమె కథానాయికగా ఎంపిక అయింది.

సల్మాన్ జోడీకట్టే ఛాన్స్ వచ్చిందంటే .. అగ్రస్థానానికి దగ్గరగా వెళ్లినట్టేనని కథానాయికలు నమ్ముతుంటారు. అందుకు నిదర్శనాలు కూడా చాలానే కనిపిస్తుంటాయి. ఆల్రెడీ షారూఖ్ సినిమాలో అవకాశాన్ని చేజిక్కించుకున్న కృతీ, సల్మాన్ సినిమాలోను ఛాన్స్ తగలడంతో సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోతోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై అలీ అబ్బాస్ జాఫర్ తెరకెక్కించనున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

,  ,