Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Feb-2015 11:21:49
facebook Twitter Googleplus
Photo

'బెంగళూర్ డేస్' రీమేక్ కి ఆర్టిస్టుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సిద్ధార్థ్, సమంతాలు వ్యక్తిగత సమస్యలతో తప్పుకోవడంతో ఆ పాత్రలకు ప్రస్తుతం వేరే నటులను ఎంపిక చేస్తున్నారు. సమంతా స్థానాన్ని శ్రీదివ్యతో భర్తీ చేయడానికి నిర్ణయించగా, ఇప్పుడు సిద్ధూ పాత్రకు దగ్గుబాటి రానాను అడుగుతున్నట్టు, ఆయన ఎంపిక ఖరారైనట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఇతర పాత్రలకు తమిళ నటుడు ఆర్య, నిత్యామీనన్ వంటి వారిని తీసుకున్నారు. 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో దిల్ రాజు, పీవీపీ సంస్థతో కలసి దీనిని నిర్మిస్తున్నారు. ఆర్టిస్టుల ఎంపిక పూర్తి కానందునే ఇది సెట్స్ కి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. ఇప్పటికే స్క్రిప్టు పని పూర్తయింది.

,  ,  ,  ,