Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Feb-2017 10:30:01
facebook Twitter Googleplus
Photo

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సినిమా ఇండస్ట్రీలో అనేకమంది సన్నిహితులు ఉన్నారు. సినీ పరిశ్రమకు ఆయన బాగా సన్నిహితంగా ఉంటారనే విషయం కూడా తెలిసిందే. ఆ మాటకు వస్తే.. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కేటీఆర్ కు దగ్గరగానే ఉంటుంది. పరిశ్రమ నుంచి వచ్చే డిమాండ్స్ ను పరిష్కరించడంలో ఆయన చూపే చొరవే.. ఇందుకు కారణంగా చెప్పచ్చు.

ఇండస్ట్రీ ఎదుర్కునే సమస్యలే కాదు.. అంతర్గతంగా వచ్చి ఓ సమస్యను కూడా కేటీఆర్ సింపుల్ గా డీల్ చేసేశారట. దర్శకుడు వంశీ పైడిపల్లి.. నిర్మాత పొట్లూరి వర ప్రసాద్ ల మధ్య తలెత్తిన వివాదం తెలిసిందే. వంశీ-పీవీపీలు సన్నిహితులే అయినా మహేష్ బాబు సినిమాను ఈ దర్శకుడు వేరే నిర్మాతలకు చేయడం పీవీపీకి నచ్చలేదు. అక్కడే కంప్లెయింట్స్ వరకూ కథ నడిచింది. అయితే.. వీరిద్దరితోను చక్కని రిలేషన్ ఉన్న కేటీఆర్.. చాలా సింపుల్ గా వారినే పరిష్కారం ఆలోచించుకోవాల్సిందిగా చెప్పారట. చివరకు పీవీపీ-వంశీలు కూడా విబేధాలను పక్కన పెట్టేశారట.

అందుకే ఘాజీ ప్రివ్యూ షోలో ఇద్దరూ కలిసి అంత సన్నిహితంగా మెలగగలిగారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఓ పెద్ద వివాదంగా మారుతుంది అనిపించిన సమస్యను.. కేటీఆర్ చాకచక్యంగా పరిష్కరించేసిన తీరు మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది.

,  ,  ,  ,  ,