Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-Jan-2017 10:58:25
facebook Twitter Googleplus
Photo

సంక్రాంతి ఫ్యామిలీ హీరో అనిపించేసుకుంటున్నాడు కుర్ర హీరో శర్వానంద్. గతేడాదితో పాటు ఈ ఏడాది కూడా భారీ చిత్రాలతో తన సినిమాని పోటీగా రిలీజ్ చేసి మరీ సక్సెస్ సాధించడం.. శర్వానంద్ క్రేజ్ కు నిదర్శనం. తాజాగా పొంగల్ కి శతమానం భవతితో సూపర్ హిట్ సాధించిన శర్వా.. ఇప్పటికే 20కోట్ల షేర్ వసూళ్లను దాటేసి 25 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతున్నాడు. ఈ స్థాయి వసూళ్లతో ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు.

ఇంకా శతమానం భవతి సంచలనాలు పూర్తికాక ముందే.. అప్పుడే శర్వానంద్ కొత్త సినిమా మొదలుపెట్టేయడం విశేషం. శతమానం షూటింగ్ జరుగుతున్నపుడే రెండు సినిమాలు లైన్ లో పెట్టాడు శర్వా. వీటిలో ఒకటి దర్శకుడు మారుతితో చేయాల్సి ఉంది. కానీ ఈ చిత్రానికి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో.. ఆ తర్వాత అనుకున్న ప్రాజెక్టును ప్రీపోన్ చేసేశాడు శర్వా. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్.. శర్వా మూవీతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. రొమాంటిక్ ఎంటర్టెయినర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో లావణ్యా త్రిపాఠిని హీరోయిన్ గా ఫైనలైజ్ చేయగా.. ఇప్పుడీ మూవీ షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.

హైద్రాబాద్ లోనే ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రాన్ని టాప్ ప్రొడ్యూసర్ లలో ఒకడైన బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించనుండడంతో.. ప్రొడక్షన్ వాల్యూస్ భారీగా ఉండనున్నాయి. శర్వా కెరీర్ లో భారీ బడ్జెట్ తో రూపొందే చిత్రంగా ఈ మూవీ నిలవనుంది.

,  ,  ,  ,  ,  ,