Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Aug-2017 10:30:56
facebook Twitter Googleplus
Photo

ఫస్ట్ లుక్.. టీజర్ లాంటివి ఒకటే ఉంటాయి. కొన్నిసార్లు రెండు ఫస్ట్ లుక్స్.. రెండు టీజర్లు కూడా రిలీజ్ చేస్తుంటారు. కానీ జై లవకుశ టీం మాత్రం ఓ కొత్త ప్రయోగానికి తెరతీసింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న నేపథ్యంలో మూడు పాత్రలకు సంబంధించి రెండేసి చొప్పన ఫస్ట్ లుక్స్.. వేర్వేరు టీజర్లు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆల్రెడీ జై పాత్రకు సంబంధించి రెండు లుక్స్.. ఒక టీజర్ లాంచ్ చేశారు. వాటికి మంచి స్పందన వచ్చింది. తర్వాత లవ పాత్రకు సంబంధించి ఇటీవలే రెండు లుక్స్ లాంచ్ చేశారు. అవీ ఆకట్టుకున్నాయి. ఇక లవ పాత్ర టీజర్.. కుశ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్.. టీజర్ కోసం నందమూరి అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

వీటికి సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. లవ పాత్ర టీజర్ వినాయక చవితి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్లో ప్రకటించారు. 25న వినాయక చవితి కాగా.. ముందు రోజు రాత్రే టీజర్ వస్తుందని భావిస్తున్నారు. ఇక కుశ పాత్ర విషయంలోనూ ఆలస్యమేమీ లేదు. నెలాఖర్లో ఈ క్యారెక్టర్ ఫస్ట్ లుక్స్ వచ్చేస్తాయట. తర్వాత కొంచెం గ్యాప్ లో టీజర్ రిలీజవుతుంది. సెప్టెంబరు 21న జై లవకుశ ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. దానికి రెండు వారాల ముందే ఆడియో వేడుక అనుకుంటున్నారు. సెప్టెంబరు రెండో వారంలో ఆడియో వేడుక జరిగే అవకాశముంది.

,  ,  ,  ,