Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

07-Sep-2017 11:23:09
facebook Twitter Googleplus
Photo

ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో రొమాన్స్ చేయడం ఎప్పటి నుంచో వస్తున్న ఫార్ములానే. అయితే టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ హీరోల ఫ్యామిలీస్ చాలానే ఉన్నాయి. ఇక స్టార్ హీరోయిన్స్ కూడా వారందరితో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు తెగ ట్రై చేస్తున్నారు. ఆ విషయంలో కాజల్ బాగానే సక్సెస్ అయ్యింది. దాదాపు మెగా ఫ్యామిలీ స్టార్ హీరోలందరితో అమ్మడు ఆడిపాడింది. ముఖ్యంగా మెగా హీరో చరణ్ తో నటించి నెక్స్ట్ ఆ హీరో ఫాథర్ తో కుమ్మేసింది.

అయితే ఇప్పుడు అదే తరహాలో మరో నటి అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. టాలీవుడ్ లో మరో సొట్ట బుగ్గల సుందరిగా పేరు తెచ్చుకున్న అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ఈ అమ్మడు గత కొంత కాలంగా విజయాలను అందుకోలేదు. చివరగా నాగార్జున సినిమాతో సోగ్గాడే చిన్ని నాయన తప్ప ఇంతవరకు ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. ఈసారి అక్కినేని నాగ ఛైతన్య -యుద్ధం శరణం సినిమాతో రాబోతోంది. తండ్రి హిట్ ఇచ్చిన విధంగానే ఇప్పుడు కొడుకు కూడా హిట్ ఇస్తాడా అని ఎదురుచూస్తోంది లావణ్య.

ప్రస్తుతం చైతు మంచి ఫామ్ లో ఉన్నాడు ప్రేమమ్ - రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలతో మంచి హిట్ అందుకొని ఇప్పుడు వాటికి బిన్నంగా కాస్త కొత్త ఫార్ములాతో రాబోతున్నాడు. ఎలాగైనా మంచి కమర్షియల్ హిట్ కొట్టి తనకంటూ ఓ మార్కెట్ ను సెట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇక ఆ సినిమా ప్రమోషన్స్ కూడా బాగానే నిర్వహిస్తున్నాడు. లావణ్య కూడా బాగానే పాల్గొంటోంది.

,  ,  ,  ,  ,