Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2016 17:06:00
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ జనతా గ్యారేజ్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా సాగుతోంది. ప్రధాన తారాగణంతో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

జనతా గ్యారేజ్ షూటింగ్ స్పాట్ కి టాలీవుడ్ టాప్ యాంకర్ అయిన సుమ ఫ్యామిలీ సహా వచ్చి సందడి చేసింది. మోహన్ లాల్ తో కలిసి కుటుంబ సమేతంగా దిగిన ఫోటోలను షేర్ చేసుకుంది సుమ. ఇలా ఓ తెలుగు యాంకర్ వచ్చి మలయాళ స్టార్ ని కలవడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. సుమ ఇక్కడ టాప్ యాంకర్ కానీ.. నిజానికి ఈమె మలయాళీ. అందుకే ఇలా స్పెషల్ వచ్చి తమ భాషకి చెందిన సూపర్ స్టార్ కలిసింది. అయితే.. సుమ భర్త రాజీవ్ కనకాల జనతా గ్యారేజ్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. సహజంగా ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ చక్కని కేరక్టర్స్ ఉంటాయి. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడమే ఇందుకు కారణం.

ఇక.. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ మూవీ ఇచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రయత్నిస్తున్నాడు. అందుకే మిల్కీ బ్యూటీ తమన్నాతో ఓ ఐటెం సాంగ్ చేయించేందుకు ప్లాన్ చేశాడు. ప్రస్తుతం అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం అయితే.. ఆగస్ట్ 12న జనతా గ్యారేజ్ విడుదల కానుంది.

,  ,  ,  ,  ,  ,