Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2016 13:14:12
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ యంగ్ బ్యూటీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ రూటే సెపరేటు. అటు కేరక్టర్ల నుంచి నుంచి ఇటు పెర్ఫామెన్స్ వరకు.. ఆఫర్ల నుంచి అవకాశాలు అందుకోవడం వరకు రకుల్ చాలా ట్యాలెంటెడ్ పర్సన్. ఇప్పటికే ఈ విషయం ప్రూవ్ అయిపోగా.. ఒక విషయంలో మాత్రం అమ్మడిగా దెబ్బ పడిందట.

గ్యాంబ్లింగ్.. చాలామందిని ఈ కాన్సెప్ట్ ఊరించేస్తుంది. సెకన్ల టైంలో ఎక్కువ సంపాదిచ్చేయంటూ బాగా టెంప్ట్ చేస్తుంది. రకుల్ కూడా ఈ విషయంలో ఓసారి ఊగిందట. అలాగని ఎక్కువేం పెట్టుబడి పెట్టేయలేదు. ఈ మధ్యే అమ్మడు ఓ వెకేషన్ టూర్ కి వెళ్లింది. వాళ్లూ వీళ్లూ అయితే మళ్లీ మూడ్ డిస్టర్బ్ అవుతుందనే ఫీలింగ్ తో.. ఎంచక్కా ఓ కాలేజ్ ఫ్రెండ్ ని వెంటబెట్టుకుని లాస్ వేగాస్ టూరే వేసింది రకుల్. మరి లాస్ వేగాస్ వెళ్లేదే గ్యాంబ్లింగ్ ని ఎంజాయ్ చేయడం కోసం కదా. అందుకనే అక్కడ ట్రై చేసింది రకుల్ ప్రీత్ సింగ్.

గ్యాంబ్లింగ్ లో రకుల్ ప్రీత్ సంపాదించిందేం లేదు. పైగా 200 డాలర్లు పోగొట్టుకున్నానని చెబుతోంది. మన కరెన్సీలో అయితే 13వేల పై మాటే. ఇది రకుల్ కి పెద్ద మొత్తం కాదని మనం అనుకుంటాం కానీ.. ప్రతీ రూపీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే కేరక్టర్ రకుల్ ది. అందుకే గ్యాంబ్లింగ్ లో పోగొట్టుకున్న మొత్తాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న రకుల్.. మళ్లీ అటువైపు వెళ్లనని శపథం కూడా చేసేసింది.

,  ,  ,  ,  ,  ,  ,  ,