Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Oct-2016 14:49:12
facebook Twitter Googleplus
Photo

ఇప్పటికీ ఎప్పటికీ టాలీవుడ్ మరువలేని కొరియోగ్రాఫీ స్టెప్ ఏదైనా ఉందా అంటే.. అది లారెన్స్ మాష్టర్ క్రియేట్ చేసిన వీణ స్టెప్పే. అయితే ఇంద్ర సినిమాలో లారెన్స్ మాష్టర్ కంటే బెటర్ గ్రేస్ అండ్ టైమింగుతో ఆ స్టెప్పును వేసి మెగాస్టార్ చిరంజీవి ఆ మూవ్మెంట్ ను చరిత్రలో నిలిచిపోయేలా చేశారు. ఆ తరువాత వీణ స్టెప్పు వంటివి మరెన్నో స్టెప్పులు స్వయంగా లారెన్సే క్రియేట్ చేసి చాలామంది తెలుగు స్టార్ హీరోలతో వేయించాడు కాని.. ఈ రేంజు సక్సెస్ మాత్రం రాలేదు. చివరికి ఠాగూర మన్మథా మన్మథా స్టెప్పుతో చిరంజీవే బీట్ చేయలేకపోయారు.

ఇకపోతే ''ఖైదీ నెం 150'' ఎంతో ప్రెస్టీజియస్ ఫిలిం. మరోసారి చిరంజీవి వెండితెరపై అభిమానులను - సినిమా లవర్స్ ను అలరించడానికి విచ్చేస్తున్నారు. ఈ సినిమాలోని తొలిపాటను నిన్నటి నుండే షూట్ స్టార్ట్ చేయడం మొదలెట్టారు. మరోసారి లారెన్స్ కొరియోగ్రాఫీలో చిరంజీవి మెరుస్తున్నారు. ఈ పాట కోసం ఎప్పటిలాగానే రెండు నెలలు బాగా ఆలోచించి ఒక కొత్త స్టెప్పును క్రియేట్ చేసుకుని వచ్చాడట లారెన్స్. ఇప్పటికే ఆ స్టెప్పులను రిహార్స్ చేసిన చిరంజీవి.. యాజూజువల్ గా గ్రేస్ తో కుమ్మేస్తున్నారు. ఆయన గతంలో చేసినట్లు డ్యాన్సులు చేస్తారా లేదా అనే సందేహం ఉన్నవారికి ఈ పాట ఒక ఆన్సర్ అంటున్నారు షూటింగ్ చూస్తున్నవారు.

ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఖైదీ నెం 150.. ఈ నెలలో పాటల షూటింగ్ పూర్తి చేసుకుంటోందట. అది సంగతి.

,  ,  ,  ,  ,  ,