Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Feb-2017 11:13:51
facebook Twitter Googleplus
Photo

తమిళ స్టార్ హీరో రాఘవ లారెన్స్ నటించిన రెండు సినిమాలు శివ లింగ, మొట్ట శివ కెట్ట శివ రిలీజుకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండిటిలో మొట్ట శివ కెట్ట శివ సినిమా చాన్నాళ్ల క్రితమే పూర్తయింది. కానీ కొన్ని ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఈ సినిమా ఇన్నాళ్లు విడుదలకు నోచుకోలేదు. చిత్ర నిర్మాతలు కూడా ఏం చేయలేక సినిమా రిలీజును వాయిదా వేస్తూ వచ్చారు.
దీంతో ఇక లాభం లేదనుకున్న హీరో రాఘవ లారెన్స్ స్వయంగా ముందుకొచ్చి మునుపు సినిమా కోసం తీసుకున్న పారితోషకం మొత్తం వెనకిచ్చి ఆర్ధిక సమస్యలను తప్పించి సినిమా విడుదలను సుగమం చేశారట. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలయ్యేందుకు రెడీ అయింది. మొత్తం మీద లారెస్ ఈ చర్యతో మరోసారి తన ఉదార భావాన్ని చాటుకున్నాడు. సాయి రమణి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నిక్కీ గల్రాని హీరోయిన్ గా నటించగా సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

,  ,  ,  ,  ,