గతంలో నాగార్జునతో 'మాస్', 'డాన్' చిత్రాలను రూపొందించిన లారెన్స్ ఇప్పుడు మళ్లీ ఆయనతో మరో సినిమా చేసే పనిలో పడ్డాడు. ఇటీవల 'కాంచన 2' చిత్రంతో దర్శకుడిగా మళ్లీ విజయపథంలోకి ప్రవేశించిన లారెన్స్ తాజాగా నాగార్జున కోసం ఓ కథ తయారుచేశాడట. నాగార్జునకు ఆ స్టోరీ లైన్ నచ్చడంతో ప్రొసీడ్ అవమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. దాంతో ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ పనిలో లారెన్స్ బిజీగా వున్నట్టు సమాచారం. ఇదిలా ఉంచితే, మరోపక్క ఇటీవల తెలుగులో వచ్చిన కల్యాణ్ రామ్ హిట్ సినిమా 'పటాస్' తమిళ రీమేక్ లో లారెన్స్ హీరోగా నటించనున్నాడు.
lawarance, news, tollywood, nagarjuna,