Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Oct-2015 16:59:55
facebook Twitter Googleplus
Photo

మరో మూడు రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్ అందాలు ఆరబోసిన బ్రూస్ లీ రిలీజ్ కాబోతోంది. ఈ పంజాబీ భామ బాగా హీటెక్కించేసింది మేకింగ్ వీడియోలు - ట్రైలర్ లలోనే. ఇప్పటివరకూ రకుల్ ఇంతగా తెగించిన దాఖలాలు లేవు. కానీ బ్రూస్ లీ లో మాత్రం రెచ్చిపోయి మరీ సౌందర్యాన్ని పంచేసింది.

బ్రూస్ లీ కోసం రకుల్ ఇంతగా తెగించడానికి సరైన కారణాలే ఉన్నాయి. అదంతా స్టార్ లీగ్ లోకి ఎంటర్ అవడానికి చేస్తున్న ప్రయత్నంలా ఉన్నా.. అసలు రీజన్ వేరే ఉంది. ఈ భామ చేతిలో బ్రూస్ లీ కాకుండా.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో - అల్లు అర్జున్ సరైనోడు ఉండడంతో.. అంతా లక్కీ గర్ల్ అంటున్నారు. కానీ అసలు రకుల్ ప్రీత్ టెన్షన్ వేరే ఉంది.

రకుల్ నటించిన చివరి మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పేలిపోయాయి. కరెంట్ తీగ - పండగ చేస్కో - కిక్2 లతో అలరించింది కానీ.. వీటిలో చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. గతేడాది కూడా రకుల్ జర్నీ ఏమంత సాఫీగా లేదు. లౌక్యం ఒక్కటే హిట్ అనిపించుకుంది. రఫ్ అనే సినిమా అడ్రస్ కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. సరైన హిట్ ఒకటి కూడా లేదు రకుల్ కెరీర్ కి.

అందుకే ఇప్పుడు తన కెరీర్ లోనే కీలక దశలో ఉండడం చేతిలో స్టార్ హీరోల పిక్చర్స్ ఉండడంతో.. వీలైనంతగా ఉపయోగించేసుకుంటోంది. రకుల్ ప్రీత్ కి బ్రూస్ లీ బ్లాక్ బస్టర్ అవడం చాలా ముఖ్యం. అందుకే అంతగా తపన పడుతోంది చెర్రీ కోసం.

,  ,  ,