Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-May-2015 09:43:51
facebook Twitter Googleplus
Photo

శక్తిమంతమైన కథాకథనాలతో బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన చిత్రం 'లయన్'. బాలకృష్ణ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని సత్యదేవ తెరకెక్కించిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాతగా వ్యవహరించారు. త్రిష .. రాధికా ఆప్టే కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందించాడు. ఇటీవల ఈ సినిమాను మే 1న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వలన ఆలస్యం జరగడంతో, మే 8న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా దర్శక నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా దర్శక నిర్మాతలు ఈ రోజున హైదరాబాద్ - ప్రసాద్ ల్యాబ్స్ లో థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, మే 8న ఉదయం 10 గంటల 4 నిమిషాలకు ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. బాలకృష్ణ అభిమానులు ఆశించిన స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

,  ,  ,  ,  ,  ,