Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Jul-2017 16:23:06
facebook Twitter Googleplus
Photo

రిలీజవ్వాల్సిన సినిమాలను కొన్ని ఎందుకో అసలు ముఖం చూడటం మానేశాయి. అలాంటి లిస్టులో హీరో సునీల్ ప్రధాన పాత్రలో రూపొందిన ఉంగరాల రాంబాబు సినిమా కూడా ఉంది. ఈ సినిమా ఓ రెండు నెలల క్రితమే రిలీజ్ అనుకున్నారు కాని.. చివరకు ఆచూకి గల్లంతైంది. అసలు సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియకుండా పోయింది.

వరుసగా కృష్ణాష్టమి.. వీడు గోల్డ్ ఏహా వంటి సినిమాల పరాజయంతో ఇప్పుడు సునీల్ సినిమాలన్నా కూడా అందరూ షాకైపోతున్నారు. ముఖ్యంగా పంపిణీదారులు బెంబేలెత్తిపోతున్నారు. వీరి సినిమాలపై మినిమం గ్యారంటీ అనే ట్యాగ్ నుండి ఇప్పుడు మినిమం లాస్ కాదు ఏకంగా మ్యాగ్జిమం లాస్ అనే నానుడికి వచ్చేసింది. అందుకే సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగరాల రాంబాబు సినిమాను మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సినిమాను తీసిన క్రాంతి మాధవ్ తీశాడన్నా కూడా బయ్యర్లు కరువయ్యారు. అందుకే సినిమా రిలీజ్ లో జాప్యం జరుగుతోందట. ఎట్టకేలకు సినిమాను పూర్తి స్థాయిలో విక్రయించడంలో ఇప్పుడు ఆగస్టు నెలలో సినిమా వచ్చే ఛాన్సుందని తెలుస్తోంది.

నిజానికి కమెడియన్ నుండి హీరో అవతారం ఎత్తాకే ఎందుకో సునీల్ ఇరగదీస్తాడని అనుకుంటే.. మనోడు ఓ రెండు మూడు ఫ్లాపుల తరువాత కాస్త స్లో అయపోయాడు. పోనివ్ కృష్ణాష్టమి సినిమాతో అయినా కొత్త పంథాలోకి వస్తాడని అనుకుంటే.. అ తరువాత కూడా అన్నీ వైఫల్యాలే.

,  ,  ,  ,