Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 17:30:34
facebook Twitter Googleplus
Photo

చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌ జంటగా సమీస్‌ మ్యాజిక్‌ సినిమా పతాకంపై ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'లవ్‌ యు అలియా'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ నెలాఖరులో ఆడియోను రిలీజ్‌ చేసి జూన్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా భూమిక, సుదీప్‌, సన్ని లియోన్‌
ఈ చిత్రం గురించి దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ మాట్లాడుతూ - ''అందర్నీ ఆకట్టుకునే చక్కని ప్రేమ కథా చిత్రమిది. యువ జంట చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌లతోపాటు ఈ చిత్రంలో ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన భూమిక, కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌, గ్లామర్‌స్టార్‌ సన్నీ లియోన్‌ ప్రత్యేక పాత్రలు పోషించారు. తెలుగులో ఎన్నో సూపర్‌హిట్‌ సాంగ్‌ని పాడిన జెస్సీ గిఫ్ట్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలోని పాటలు సినిమాకి చాలా ప్లస్‌ అవుతాయి. ఈ నెలాఖరులో ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి జూన్‌లో చిత్రాన్ని రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు.
భూమిక, సుదీప్‌, సన్నిలియోన్‌ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో చందన్‌కుమార్‌, సంగీత చౌహాన్‌, నికిషా పటేల్‌, రవిచంద్రన్‌, రవిశంకర్‌, షాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: జెస్సీ గిఫ్ట్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ రాయ్‌ పతాజే, ఎడిటింగ్‌: సురేష్‌ డి.హెచ్‌., నిర్మాణం: సమీస్‌ మ్యాజిక్‌ సినిమా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇంద్రజిత్‌ లంకేష్‌

,  ,  ,  ,