Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Jul-2017 11:05:12
facebook Twitter Googleplus
Photo

స్టార్ హీరోలు ఎవరూ ఒక పట్టాన కొత్త సినిమాల సంగతి తేల్చడం లేదు. చేస్తున్న సినిమా పూర్తవాలి.. దానికి ప్రచారం చేయాలి.. రిలీజ్ వరకూ ఆగాలి.. రిజల్ట్ తేలాలి.. ఆ రిజల్ట్ ప్రకారం నెక్ట్స్ మూవీ విషయంలో డిసైడ్ ఆవ్వాలి. చాలామంది హీరోల తంతు ఇలాగే ఉంటుంది. మొన్నమొన్నటి వరకూ మహేష్ కూడా ఇంతే కానీ.. మహేష్ మరుసటి చిత్రం ఏంటి అనే విషయం.. దాదాపుగా డిసైడ్ అయిపోయి ఉంటుందంతే.

కానీ ఇప్పుడు మరీ దూకుడు మీద ఉన్నాడు మహేష్. మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం ఇంకా పూర్తి కాకముందే.. కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభించేశాడు కూడా. దసరా రిలీజ్ కు స్పైడర్ ను షెడ్యూల్ చేయగా.. ఆగస్ట్ లో ఓ పాట పిక్చరైజేషన్ చేయనున్నారు. ఇలా ఓ సినిమా షూటింగ్ ను ఫినిష్ చేయకుండా మరసటి చిత్రం మొదలుపెట్టడం.. ఈ మధ్య కాలంలో మహేష్ ఎన్నడూ చేయలేదు. అంతే కాదు.. కొరటాల చిత్రం తర్వాత కూడా మహేష్ సినిమా ఖాయం అయిపోయింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ కొత్త సినిమా చేయనుండగా.. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు వంశీ అండ్ టీం. ఆ తర్వాత దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. రాజమౌళి-మహేష్ కాంబినేషన్ లో ఓ మూవీ చేసేందుకు గాను.. నిర్మాత కేఎల్ నారాయణ ఒప్పందం చేసుకున్నారు. సో.. జక్కన్న మరుసటి చిత్రం వచ్చే ఏడాదిలో ప్రారంభం కానుందని.. అందులో మహేష్ చేస్తాడనే వార్తలు ఖాయమేనని టాక్.

,  ,  ,  ,  ,