Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 13:27:14
facebook Twitter Googleplus
Photo

మిలీనియం టైమ్ లో ఈ హీరోకు దేశవ్యాప్తంగా లవర్ బోయ్ అనే ఇమేజ్ విపరీతంగా ఉండేది. సఖి.. వంటి మణిరత్నం సినిమాలతో పాటు ఇదే ఇమేజ్ తో పలు సినిమాలు చేసి.. బోలెడంత క్రేజ్ సంపాదించేసుకున్నాడు. అప్పట్లో అమ్మాయిలంతా మాధవన్ కు విపరీతమైన ఫ్యాన్స్.

ఇప్పుడు ఏళ్లు గడిచిపోయాయి కానీ.. మాధవన్ మాత్రం తన హాట్ లుక్స్ ను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మహిళలను తన లుక్స్ తో టెంప్ట్ చేస్తూనే ఉన్నాడు. తనకు క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని నిరూపించేశాడు కూడా. రీసెంట్ గా మాధవన్ తన సోషల్ మీడియా పేజ్ లో ఓ సెల్ఫీని పోస్ట్ చేశాడు. జస్ట్ అపుడే షవర్ బాత్ చేసి వచ్చి.. బాడీ చూపిస్తూ పోజ్ ఇచ్చి.. ఫోటో దిగేసి నెట్ లో పెట్టేశాడు. మాధవన్ ను ఇలా ఎప్పుడూ చూడని సోషల్ మీడియా ఒక్కసారిగా షాక్ తినేసింది. ఫోటో పోస్ట్ చేసిన గంటల వ్యవధిలోనే వేల కొద్దీ షేర్స్ తో పాటు.. కుప్పలు తెప్పలుగా కామెంట్స్ వచ్చి పడ్డాయి. వీటిలో ఎక్కువ ఫిమేల్ ఫాలోయర్స్ నుంచి కావడం విశేషం.

ఇంత హాట్ లుక్స్ తో తమను ఇంకా మెస్మరైజ్ చేయవద్దని.. ప్రస్తుతం తాము పెళ్లి చేసుకుని సెటిల్ అయామని.. తమను ఇలా ఇబ్బంది పెట్టడం సరికాదంటూ రకరకాల కామెంట్స్ వచ్చాయి. వీటిలో చాలా వరకూ ట్వీట్స్ ను ఓపికగా రీట్వీట్ చేసిన మాధవన్.. కొన్నిటికి రిప్లై కూడా ఇచ్చాడు. తనపై చూపిస్తున్న అభిమానానికి బోలెడన్ని థ్యాంక్స్ చెప్పాడు మాధవన్.

,  ,  ,  ,