Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2017 14:01:31
facebook Twitter Googleplus
Photo

బాహుబలి చిత్రంతో శివగామి పాత్రకు ఎంతటి ప్రాచుర్యం లభించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరో ప్రభాస్ తర్వాత అందరి నోళ్లల్లో నానిన పేరు ఏదైనా ఉందంటే అది శివగామి క్యారెక్టరే. బహుబలి మూవీతో ప్రాచుర్యం పొందిన శివగామి క్యారెక్టర్ ను బుల్లితెర మీద మరింతగా చూసేందుకు అవకాశం లభించనుంది.

స్టార్ ప్లస్ లో ప్రసారం కానున్న ఆరంభ్ సీరియల్ లో శివగామి క్యారెక్టర్ లో అలనాటి రోజా ఫేం మధుబాలను ఓకే చేశారు. బహుబలి రచయిత విజయేంద్రవర్మ ఈ సీరియల్ కు కథను అందించారు. ఇదే సీరియల్ లో దేవసేన పాత్రను తమిళ.. తెలుగు నటి కార్తీక (అలనాటి బ్యూటీ రాధ కుమార్తె) నటించనున్నారు. ఇప్పటికే ఈ సీరియల్ ప్రోమోలో బహుళ ఆదరణ పొందుతున్నాయి.

ఈ సీరియల్ లో మధుబాల శివగామి పాత్రలో కనిపించనున్నారు. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉన్న మధుబాల.. తాజాగా పవర్ ఫుల్ పాత్రలో బుల్లితెర మీద కనిపించేందుకు ఓకే అన్నారు. తనకు టీవీ షో షెడ్యూళ్లు భయపెడుతుంటాయని.. కానీ.. ఈ సీరియల్ అలా లేదని అందుకే ఒప్పుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ సీరియల్ లో పని చేసేందుకు ఒప్పుకోవటానికి కారణం సీరియల్ దర్శకుడు గోల్డీ బెహన్ అని చెప్పారు. గోల్డీ సతీమణి మధుబాలకు మంచి స్నేహితురాలు. దీంతో.. స్నేహం కారణంగానే ఈ సీరియల్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లు చెబుతున్నారు.

,  ,  ,  ,  ,