Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Oct-2015 16:21:06
facebook Twitter Googleplus
Photo

ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటాడు రాజమౌళి. అలాగని దేని మీద పడితే దాని మీద మాట్లాడడు. ఆయన ట్వీట్ చేయాలంటే ఆ అంశానికి ఓ వాల్యూ ఉండాలి. ఓ క్వాలిటీ ఉండాలి. ఆయన వేరే సినిమా గురించి స్పందించాడు అంటే.. కచ్చితంగా అందులో విశేషం ఉండే ఉంటుంది. ఏ సినిమా గురించైనా సరే.. జక్కన్న విడుదలకు ముందు కానీ విడుదల తర్వాత కానీ స్పందించాడు అంటే అది దాదాపుగా సూపర్ హిట్టే అని ఓ సెంటిమెంటు ఉంది టాలీవుడ్ లో. ఎందుకంటే చాలా చాలా నచ్చితే తప్ప ఆయన ఏ సినిమా గురించీ రెస్పాండవడు.

అత్తారింటికి దారేది - లెజెండ్ - టెంపర్ - భలే భలే మగాడివోయ్ సినిమాల గురించి ఆయన చెప్పిన మాటలు అక్షర సత్యమయ్యాయి. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్ - బ్లాక్ బస్టర్ రేంజికి వెళ్లాయి. రాజమౌళి తానో సినిమా చూడాలని ఉత్సాహం చూపించాడంటే ఆ సినిమా సూపర్ హిట్టే అని జనాల నమ్మకం. అందుకే తమ సినిమాల గురించి రాజమౌళి ట్వీట్ చేస్తే బాగుణ్నని చాలామంది నిర్మాతలు ఆశగా చూస్తుంటారు.

ఐతే ఇప్పుడు జక్కన్న ?రుద్రమదేవి? గురించి మాట్లాడటం గుణశేఖర్ అండ్ టీంకి ఉత్సాహాన్నిచ్చేదే. రుద్రమదేవి హిందీ ట్రైలర్ చూశానని.. అది చాలా బాగుందని.. అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతమని.. రుద్రమదేవి 3డీ క్వాలిటీ చాలా బాగుందని విన్నానని రాజమౌళి అన్నాడు. తాను 2డీలో చూడాలనుకుంటుంటే.. తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం 3డీలో చూద్దామని పట్టుబడుతున్నారని.. తాను రెండు ఫార్మాట్లలోనూ సినిమాను చూస్తానేమో అని రాజమౌళి అన్నాడు. జక్కన్న ఇంత ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి ఆయన ట్రాక్ రికార్డుకు తగ్గట్లే ?రుద్రమదేవి? హిట్ ఖాతాలో చేరుతుందేమో చూడాలి.

,  ,  ,