Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Apr-2016 12:04:22
facebook Twitter Googleplus
Photo

స్టైల్ కు పర్యాయపదం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అలాంటి వ్యక్తి పట్టుమని పది సినిమాలు చేయని బన్నీకి ఓ కాంప్లిమెంట్ ఇచ్చారట. ఆ విషయాన్ని ఎవరో కాదు బన్నీనే స్వయంగా చెప్పటం విశేషం. రజనీకాంత్ లాంటి వ్యక్తి తనను గుర్తించటమే కాదు.. తనకున్న క్రేజ్ గురించి చెప్పటాన్ని జీవితంలో మర్చిపోలేనని చెబుతున్నాడు బన్నీ. ఇంతకీ రజనీ చెప్పిన ఆ క్రేజ్ మాటేమిటన్న విషయాన్ని అల్లుఅర్జున్ ఏం చెప్పారంటే..

??ఒకసారి చెన్నైకి డైరెక్టర్ సుకుమార్ తో వెళ్లా. షాపింగ్ మాల్ కి వెళ్లి తిరిగి వస్తున్నాం. అక్కడ చాలా కోలహాలంగా ఉంది. ఏమిటంటే.. రజనీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పారు. రజనీసార్ ను చూడాలనిపించినా.. నా గురించి తెలియాలి కదా? నాకు నేను వెళ్లి.. నేనండీ అల్లు అర్జున్ ని. అరవింద్ గారి అబ్బాయినని పరిచయం చేసుకోవటం ఏం బాగుంటుందిలే అని తిరిగి వస్తున్నాం??

?? కానీ.. వెనుక నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకు వస్తున్నాడు. సార్.. మిమ్మల్ని రజనీ సార్ పిలుస్తున్నారన్నాడు. నాకు ఒక్కక్షణం షాక్. నన్ను రజనీకాంత్ పిలవటం ఏమిటనుకుంటూ ఆయన దగ్గరకు వెళ్లాం. నన్ను చూసిన రజనీకాంత్.. ఎలా ఉన్నారంటూ క్షేమ సమాచారం అడగటమే కాదు.. సినిమాలు బాగా చేస్తున్నావయ్యా. అమ్మాయిల్లో నీకు మాంచి ఫాలోయింగ్ ఉంది. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నావంటూ పొగిడేశారు. నాకు అమ్మాయిల్లో క్రేజా? అనుకునే వాడిని. ఎవరైనా చెబితే నమ్మేవాడిని కాదు. కానీ.. స్టైల్ కి.. క్రేజ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన రజనీసారే పొగిడేసరికి.. వావ్ అనిపించింది. ఆశ్చర్యంతో షాక్ తిన్నా?? అని పాత సంగతుల్ని చెప్పుకొచ్చాడు.

,  ,  ,  ,  ,