Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2017 15:38:34
facebook Twitter Googleplus
Photo

బాబుతో.. మురుగదాస్ తో సినిమా చేయడం గురించి రకుల్ ప్రీత్ మొదట్నుంచి ఎంత ఎగ్జైట్ అయిపోతోందో? కొన్ని నెలల నుంచి రకుల్ ను కదిపితే చాలు.. స్పైడర్ ముచ్చట్లే చెబుతోంది. వీళ్లిద్దరి గురించి గొప్పగా మాట్లాడుతోంది. కానీ ఆ ఇద్దరూ ‘స్పైడర్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో రకుల్ సంగతి మరిచిపోయారు. ముందుగా మురుగదాస్ ఆమెను విస్మరించాడు. తన ప్రసంగంలో మహేష్ తో పాటు చాలామంది గురించి మాట్లాడాడు మురుగ. తన డైరక్టోరియల్ టీంను కూడా అందరికీ పరిచయం చేశాడు. టెక్నీషియన్స్... నిర్మాతలు.. మిగతా ప్రధాన పాత్రధారుల గురించీ ప్రస్తావించాడు. కానీ రకుల్ మాట ఎత్తలేదు.

ఐతే తన ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయిన ఆయన.. మళ్లీల వెనక్కి వచ్చి రకుల్ ను తానెలా మరిచిపోయానో అంటూ రిగ్రెట్ అయ్యారు. ఆమె గురించి నాలుగు మంచి మాటలు చెప్పి వెళ్లాడు. ఆ తర్వాత చివరగా మైకు అందుకున్న మహేష్ సైతం రకుల్ సంగతి మరిచిపోయాడు. ఎప్పుడూ క్లుప్తంగా మాట్లాడే మహేష్.. ఈ వేడుకలో ఏకంగా 9 నిమిషాల దాకా మాట్లాడటం విశేషం. ఆ ప్రసంగంలో అతను కూడా చాలామంది గురించి మాట్లాడి.. రకుల్ ప్రస్తావన లేకుండానే ప్రసంగాన్ని ముగించాడు. కానీ అంతలోనే ఆమెను గుర్తు చేసుకుని.. మురుగదాస్ ను మరిచిపోయినట్లే తాను కూడా రకుల్ ను మరిచిపోయానంటూ నవ్వేశాడు. రకుల్ ఆ టైంలో పగలబడి నవ్వింది.

,  ,  ,  ,  ,