Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Apr-2017 10:28:06
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు కొత్త సినిమా పేరు స్పైడర్ అనే విషయం ఇప్పుడు అఫీషియల్. ఇదే టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. సింపుల్ అండ్ స్టైలిష్ గా డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి. సినిమా అంచనాలను ఒక్కసారిగా పెంచడం కాకుండా.. దశలవారీగా హైప్ పెంచాలనే దర్శకుడి ఆలోచన అర్ధమవుతూనే ఉంది.

అయితే.. ఇదే సమయంలో మహేష్ బాబు రకుల్ ప్రీత్ సింగ్ ల ఫోటో కూడా ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. మహేష్ తన మొబైల్ చూసుకుంటూ ఉంటే.. రకుల్ అతని ఫోన్ లో మ్యాటర్ ని గమనించేందుకు ప్రయత్నిస్తున్న ఈ ఫోటో ఆకట్టుకుంటోంది. స్పైడర్ మూవీలో స్పై పాత్రలో మహేష్ కనిపిస్తాడనే విషయం మనకు తెలుసు. అయితే.. ఈ పోస్టర్ చూస్తే మాత్రం.. స్పై రోల్ ను రకుల్ తీసుకున్నట్లుగా ఉంది. పైగా గూఢచారిపై గూఢచర్యం చేసేస్తోంది రకుల్ ప్రీత్ సింగ్.

నిజానికి స్పైడర్ లో రకుల్ ప్రీత్ చేస్తున్న పాత్ర ఓ డాక్టర్. ఇప్పటివరకూ రకుల్ చేసిన సినిమాల్లో అతి పెద్ద బడ్జెట్ మూవీ ఇదే కావడం.. బిజినెస్ పరంగా కూడా అత్యధిక క్రేజ్ ఉండడం.. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రిలీజ్ కానుండడంతో.. స్పై డర్ కోసం తన సర్వ శక్తులు ఒడ్డుతోంది రకుల్ ప్రీత్. ఈ మూవీ మొత్తం ఇలా కళ్లజోడు లుక్ లోనే కనిపిస్తుందట రకుల్

,  ,  ,  ,  ,  ,