Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 11:07:59
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ కు అర్జున్ రెడ్డి ఫీవర్ పట్టుకుంది. వివాదాలతో ప్రారంభమైన ఈ సినిమాలో అంతే స్థాయిలో కంటెంట్ ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రేక్షకులతో పాటు స్టార్ హీరోలు - డైరెక్టర్ లు కూడా అర్జున్ రెడ్డికి ఫిదా అయిపోయారు. ఆ సినిమా హీరో విజయ్ దేవరకొండ....టాలీవుడ్ లియెనార్డో డికాప్రియో అని వర్మ తెగ పొగిడేసిన సంగతి తెలిసిందే. జక్కన్న కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా ఆ జాబితాలోకి ప్రిన్స్ మహేష్ బాబు చేరిపోయాడు. అర్జున్ రెడ్డి సినిమా సినిమాపై తన స్పందనను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు మహేష్.

అర్జున్ రెడ్డి సినిమాపై మహేష్ బాబు ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు. ఈ సినిమాను ఎంతో నేచురల్ గా బోల్డ్ గా - ఇంటెన్స్ గా తీశారన్నాడు. అన్ని సినిమాలూ వెళ్లే దారిలో కాకుండా కొత్తగా తీశారని వరుస ట్వీట్లతో ప్రశంసించాడు. మూస సినిమాలకు ఈ సినిమాతో బ్రేక్ పడుతుందన్నాడు. హీరో విజయ్ దేవరకొండ నటన అద్భుతమన్నాడు. హీరోయిన్ షాలిని సినిమాలో మిగతా పాత్రలు బ్రిలియంట్ గా ఉన్నాయన్నాడు. ఇది సందీప్ వంగా మొదటి సినిమా అంటే నమ్మలేకపోతున్నానని ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా చిత్రీకరించాడని చెప్పాడు.

,  ,  ,  ,