Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jun-2015 17:34:51
facebook Twitter Googleplus
Photo

బాహుబలి సినిమా జూలై 10న విడుదల కానుండటంతో, ఆ తేదీ కోసం అంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అదే విధంగా జూలై 17 న రానున్న 'శ్రీమంతుడు' కోసం కూడా మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు విడుదల తేదీని ఆగస్టు 7కు మార్చుకున్నాడు. దాంతో బాహుబలి సృష్టించనున్న ప్రభంజనాన్ని ఊహించి, శ్రీమంతుడు సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారనే ప్రచారాన్ని కొంతమంది భుజానికెత్తుకున్నారు.


పరిస్థితిని గ్రహించిన బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా, ఆ ప్రచారానికి అడ్డుకట్ట వేశారు. శ్రీమంతుడు సినిమా దర్శక నిర్మాతలను తాము కలిసి ఆ సినిమా విడుదల తేదీని మార్చుకోమని రిక్వెస్ట్ చేశామనీ, అందుకు పెద్దమనసుతో వాళ్లు అంగీకరించారని చెప్పారు. ఈ విషయంగా హీరో మహేష్ బాబుతో పాటు, శ్రీమంతుడు దర్శకనిర్మాతలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆయన చెప్పారు.

,  ,  ,