Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Oct-2017 12:33:55
facebook Twitter Googleplus
Photo

ఒక హీరోయిన్ తో జోడీ కట్టిన తర్వాత మళ్లీ అదే హీరోయిన్ తో సినిమా చేయడం.. కాస్త అరుదుగా జరిగే విషయమే. రీసెంట్ టైంలో సమంతతో మూడు సినిమాలు చేయడం మినహాయిస్తే.. మరే హీరోయిన్ కు ఇలా రిపీట్ అవకాశం ఇవ్వలేదు. మహేష్ బాబు నుంచి ఇలా వెంటనే ఆఫర్ వచ్చేయడం అంత సులభం కాదు.

అయితే.. స్పైడర్ మూవీ తర్వాత మళ్లీ రకుల్ ప్రీత్ సింగ్ కు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట మహేష్. స్పైడర్ లో తొలిసారిగా మహేష్-రకుల్ కాంబో కనిపించింది. రకుల్ కు అంతగా స్క్రీన్ టైం లేకపోవడం.. సినిమా ఫెయిల్ కావడం డిజప్పాయింట్ చేసే అంశాలు కాగా.. మళ్లీ మహేష్ తో కలిసి నటించేందుకు పిలుపు అందడాన్ని మాత్రం పాజిటివ్ గా చెప్పుకోవాలి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబు.. కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఆ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ హీరోగా ఓ సినిమా చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చ్ నాటికి ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉండగా.. ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ రకుల్ చేతిలో పెట్టారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

రకుల్ కంటే ముందే మహేష్-వంశీ కాంబో మూవీలో డీజే భామ పూజా హెగ్డేను హీరోయిన్ గా ఫిక్స్ చేశారని అన్నారు. ఇప్పుడు రకుల్ ప్రీత్ ను మరొక పాత్రకు తీసుకున్నారో.. పూజా హెగ్డే రోల్ ను రకుల్ తో రీప్లేస్ చేశారో అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు.

,  ,  ,  ,  ,