Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Apr-2016 15:38:42
facebook Twitter Googleplus
Photo

ప్రిన్సు మహేశ్ బాబు కొత్త సినిమా కోసం మల్టీ టేలెంటెడ్ విలన్ దొరికాడు. తెలుగు - తమిళ సినిమాల్లో దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడంతోపాటు నటుడిగా - హీరోగానూ మంచి ఇమేజి ఉన్న ఎస్.జె.సూర్య ఇప్పుడు మహేశ్ కొత్త సినిమాలో ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడట. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఎస్.జే.సూర్యను ఖరారు చేసేశారు. అయితే... మహేశ్ సినిమా కోసం సూర్య ఏకంగా తమిళ యంగ్ స్టార్ ధనుష్ సినిమాలో ఛాన్సును ఆయన వదులుకున్నాడు. ధనుష్ లేటెస్టు మూవీ 'ఎనాయ్ నొక్కి పాయుమ్' కోసం సూర్యను సంప్రదించారని.. అయితే.. అయితే మహేశ్ సినిమాకు కమిట్ అవడంతో ధనుష్ సినిమా ఆఫర్ కు నో చెప్పేశాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే పలుచిత్రాల్లో హీరోగా నటించిన సూర్య - ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న 'ఇరైవి'లో విలన్ గా చేస్తున్నాడు. మహేశ్-మురుగదాస్ సినిమా ఏప్రిల్ నెలాఖరుకల్లా సెట్సు మీదకు వెళ్తుందట. అయితే ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా నటించే హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతోంది. తమిళనటి సాయి పల్లవి - కీర్తి సురేష్ లతో పాటు బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పేరు కూడా వినిపిస్తున్నాయి. మహేశ్ స్టార్ డమ్ నేపథ్యంలో పరిణీతి చోప్రాను హీరోయిన్ గా తీసుకుంటారని తెలుస్తోంది. అయితే తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా చిత్రీకరిస్తుండడంతో సాయిపల్లవికీ అవకాశాలున్నాయంటున్నారు.

,  ,  ,  ,  ,  ,