Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-May-2015 10:56:47
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ టాప్ స్టార్స్ పవన్ కల్యాణ్, మహేష్ బాబు బాక్సాఫీసు వద్ద పోటీ పడితే ఎలా వుంటుంది? సీను మంచి రసవత్తరంగా వుంటుంది కదూ? ఈసారి అలాంటి సన్నివేశాన్ని వీక్షించే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం' అనే చిత్రాన్ని చేయనున్న సంగతి తెలిసిందే. దీనిని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని కూడా దర్శకుడు వెల్లడించాడు. ఇదిలా ఉంచితే, పవన్ కల్యాణ్ హీరోగా బాబీ (కెయస్ రవీంద్ర) దర్శకత్వంలో రూపొందే 'గబ్బర్ సింగ్ 2' చిత్రాన్ని కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా సమాచారం అందుతోంది. ఒకవేళ ఇలా వీరిద్దరి సినిమాలూ అలా ఒకేసారి విడుదలైతే కనుక బాక్సాఫీసు పోరు తప్పదని చెప్పుకోవచ్చు!

,  ,  ,  ,  ,  ,