Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-May-2016 15:20:09
facebook Twitter Googleplus
Photo

బ్రహ్మోత్సవం సినిమా విడుదలకు ఇంకో వారం రోజులే సమయముంది. ఇంకా మహేష్ తో పాటు ఇంకెవరూ నేరుగా రంగంలోకి దిగలేదు. ప్రమోషన్ మొదలుపెట్టలేదు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ?బ్రహ్మోత్సవం? జోరు మామూలుగా లేదు. ఓ వైపు పాటలు హోరెత్తుతున్నాయి. మరోవైపు రోజుకో కలర్ ఫుల్ పోస్టర్ తో పిచ్చెక్కిస్తున్నారు. పేరుకు తగ్గట్లే ఓ ఉత్సవాన్ని తలపించేలా ఉన్నాయి ఈ సినిమా పోస్టర్లు. చాలా కలర్ ఫుల్ గా.. ఆకర్షణీయంగా ఈ పోస్టర్లను డిజైన్ చేస్తున్నారు. ఇక మహేష్.. కాజల్.. సమంత.. ఒకరితో ఒకరు పోటీ పడుతూ పోస్టర్లకు మరింతగా అందం తెస్తున్నారు.

ఈ మధ్య కాలంలో మరే సినిమాలోనూ లేని స్థాయిలో మహేష్ కు.. హీరోయిన్లకు మహా బాగా కెమిస్ట్రీ పండినట్లుంది ?బ్రహ్మోత్సవం?లో. నిన్నా మొన్నా కాజల్ మీద మహేష్ వాలిపోతూ రొమాన్స్ పండించేస్తున్న ఫొటోలు హల్ చల్ చేస్తే.. ఇప్పుడిక సమంత వచ్చి మహేష్ మీద పడిపోతూ ముచ్చట్లు చెప్పేస్తున్న ఫొటోలు సందడి చేస్తున్నాయి.

మొత్తానికి సౌత్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లతో కలిసి మహేష్ కెమిస్ట్రీ.. ఫిజిక్సూ మహ బాగా పండించేసినట్లున్నాడు ?బ్రహ్మోత్సవం?లో. మామూలుగా మహేష్ రొమాన్స్ చేయడంలో కొంచెం వీక్ అని పేరుంది. కానీ ?బ్రహ్మోత్సవం?తో ఆ ముద్ర చెరిపేయబోతున్నాడేమో అనిపిస్తోంది పోస్టర్లు చూస్తుంటే. పోస్టర్లలోనే ఇలా ఉంటే.. ఇక సినిమాలో ఇంకెంతగా సయ్యాటలు ఆడాడో చూడాలి మరి.

,  ,  ,  ,  ,  ,