Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Jun-2016 14:43:50
facebook Twitter Googleplus
Photo

ఎక్స్ ప్రెస్ రాజా హీరో శర్వానంద్ మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. శర్వానంద్, నిత్యామీనన్ ల కాంబినేషన్లో రెండో సినిమాగా తెలుగు, తమిళ భాషల్లో చాలా కాలం క్రితమే రూపొందించిన ఓ సినిమా మొదట తమిళంలో విడుదలై అక్కడ ఫ్లాప్ అవడంతో ఈ సినిమా తెలుగులో విడుదలకు నోచుకోలేదు. కొద్దిరోజుల క్రితం ?ఏమిటో ఈ మాయ? అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నించి విఫలమయ్యింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని త్వరలో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం సన్నాహాలు చేస్తోంది. ?ఏమిటో ఈ మాయ? అన్న పేరుని మార్చుకుని ?రాజాధిరాజా? గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. జాతీయ అవార్డు గ్రహీత చేరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని బృందావనం పిక్చర్స్ అధినేత యన్. వెంకటేష్ తెలుగులో ఈ నెల 24 న విడుదల చేస్తున్నారు. ప్రకాష్ రాజ్, సంతానం కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.

,  ,  ,  ,  ,  ,  ,