Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jan-2017 11:06:00
facebook Twitter Googleplus
Photo

మహేష్ బాబు ప్రస్తుతం యూరోప్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. క్రిస్మస్ ముందు నుంచి న్యూ ఇయర్ పూర్తయ్యే వరకూ లాంగ్ వెకేషన్ లో ఉన్న మహేష్ బాబు.. మళ్లీ తన మూవీ పనులు స్టార్ట్ చేసేందుకు సిద్ధమైపోయాడు.

మురుగదాస్ తో తెరకెక్కుతున్న మూవీ కోసం అహ్మదాబాద్ లో దాదాపు 4 వారాలపాటు షూటింగ్ నిర్వహించిన మహేష్.. ఫ్యామిలీ టూర్ కోసం బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ జనవరి 7 నుంచి మురుగదాస్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం హైద్రాబాద్ లో భారీ సెట్ నిర్మాణం జరుగుతుండగా.. కొత్త సెట్ లో మెజారిటీ భాగం ఈ సెట్ లోనే షూటింగ్ జరగనుందట. వీలైనంత త్వరగా మురుగదాస్ తో చేస్తున్న ఈ చిత్రాన్ని కంప్లీట్ చేయాలన్నది మహేష్ టార్గెట్. 'సంభవామి' అనే టైటిల్ ఈ చిత్రానికి అనుకుంటున్నా.. ఇంకా ఫైనల్ కాలేదన్న సంగతి తెలిసిందే. అందుకే న్యూ ఇయర్ కి టీజర్ రిలీజ్ చేయలేదని అనుకుంటున్నారు సిని జనాలు.

'మురుగదాస్ డైరెక్షన్ కావడంతో తమిళ్ రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ నెలకొందని.. తమిళ్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నామని ' చెబుతున్నారు నిర్మాతలు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో.. దర్శకుడు ఎస్ జే సూర్య విలన్ గాను.. మరో తమిళ హీరో భరత్ కూడా నెగిటివ్ రోల్ లోను కనిపించనున్నాడు.

,  ,  ,  ,  ,