Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Nov-2016 10:16:30
facebook Twitter Googleplus
Photo

బాహుబలి మూవీలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ఏ స్థాయి గుర్తింపు సంపాదించిందో చూస్తూనే ఉన్నాం. ఆ పాత్రకే వన్నె తెచ్చిన రమ్యకృష్ణకు.. బాహుబలి తర్వాత ప్రెస్టీజియస్ పాత్రలు ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఉత్సాహం చూపుతున్నారు. ఛాలెంజింగ్ రోల్స్ లో తనదైన నటనతో ఆకట్టుకుంటున్న రమ్యకృష్ణ.. ఇప్పుడు సూర్య మరుసటి సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం కన్ఫాం అయింది.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'తానా సెరేంధ్ర కూటం' ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. తమిళనాడులోని కరైకుడి ప్రాంతంలో షూటింగ్ జరుపుతుండగా.. ఇక్కడ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇవి సినిమా యూనిట్ అఫీషియల్ గా విడుదల చేసిన ఫోటోలు కాకపోయినా.. లీక్డ్ ఫోటోల్లో రమ్యకృష్ణ లుక్ స్పష్టంగా తెలిసిపోతోంది. బాలీవుడ్ మూవీ స్పెషల్ 26కు ఇది రీమేక్ అనే టాక్ ఉన్నా.. దీనిని దర్శకుడు విఘ్నేష్ శివన్ ఖండించాడు.

సూర్య సినిమాలో రమ్యకృష్ణ నటిస్తోందనే విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా.. నెట్లో లీక్ అయిన ఈ ఫోటోలతో అసలు విషయం అందరికీ తెలిసిపోయింది. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,